తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా బులెటిన్, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై తమ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించింది. జూన్ 8 నుంచి ఒక్క ఉత్తర్వును అధికారులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ఆదేశించింది.
కరోనా కేసుల వివరాలతో రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసే బులెటిన్ లో సమాచారం సరైన రీతిలో లేదని, దీనిపై CSనే ప్రశ్నిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. కరోనా కేసులన్నింటిపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.
మరోవైపు తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత పనుల కవరేజీకి మీడియాకు అనుమతినిచ్చింది. మీడియా ప్రతినిధులను బీఆర్కే భవన్ నుంచి నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో సచివాలయ భవనాల కూల్చివేత పనుల వద్దకు తీసుకెళ్లనున్నారు. కాగా, ఇప్పటికే సచివాలయ భవనాల కూల్చివేత పనులు దాదాపు 90 శాతం పూర్తైన్నట్లు తెలిసింది. భవనాలు కూల్చివేసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతోనే ఇప్పటివరకు అనుమతించలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది
సచివాలయ పనుల కూల్చివేత పనులను కవరేజ్ చేయడానికి అనుమతించాలని V6 న్యూస్, వెలుగు పత్రిక హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు కూడా ప్రభుత్వ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు మీడియాకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Your article helped me a lot, is there any more related content? Thanks!