టామ్ అండ్ జెర్రీ:
ప్రపంచం మొత్తం మీద టామ్ అండ్ జెర్రీలంటే పడి చచ్చిపోయేవాళ్లు ఎంతో మంది. ఆరు నుంచి పది నిమిషాల నిడివిలోనే ఉండే పొట్టి ఎపిసోడ్లు ప్రేక్షకులను తెగ నవ్విస్తాయి. ఇవి 1940లో తొలిసారి అమెరికాలో ప్రసారం అయ్యాయి. అప్పటి నుంచి అన్ని దేశాల ప్రజలకు పరిచయం అయిపోయాయి. మొదట్లో వీటికి జాస్పర్ అండ్ జింక్స్ అని పేరు పెట్టారు. అనంతరం టామ్ అండ్ జెర్రీగా మార్చారు. యానిమేషన్ సిరీస్‌లలో ఎక్కువ ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నది టామ్ అండ్ జెర్రీ షోనే. 79 ఏళ్లుగా కార్టూన్ ప్రేమికులను ఇవి నవ్విస్తూనే ఉన్నాయి. మార్కెట్లో వీటి బ్రాండ్ వాల్యూ 80 కోట్ల డాలర్లకు తగ్గదు. టామ్ అండ్ జెర్రీలు చాలా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నాయి.
డొరేమాన్:

జపాన్ కామిక్ పాత్ర డొరేమాన్. భవిష్యత్తులో పుట్టి వర్తమానంలో నివసిస్తున్న రోబో పిల్లి ఇది. 1970లో కామిక్ పుస్తకాల రూపంలో తొలిసారి పిల్లల్ని అలరించింది. యానిమేషన్ రంగం పుంజుకున్నాక 1979లో కదిలే బొమ్మల కార్టూన్‌గా మారింది. 2015లో డొరేమాన్ కథలను అచ్చేస్తే.. 30 దేశాల్లో పదికోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. 22వ శతాబ్దానికి చెందిన రోబో పిల్లి డొరేమాన్‌ను.. నొబితా అనే చిన్నారికి సాయపడటానికి అతడి తాత పంపిస్తాడు. డొరేమాన్ పేరుతో జరిగే వ్యాపారం అంతా ఇంతా కాదు. 1999లో డొరేమాన్ ఓ బ్రాండ్‌గా అవతరించింది. ఏడాదికి 55 కోట్ల డాలర్లకు తగ్గకుండా అమ్మకాలు జరుగుతున్నాయి.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?