ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సూచనలు

APలోని కర్నూలు జిల్లా చిన్నటేకూర్ దగ్గర జరిగిన బస్సు  ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఈ క్రమంలో TGSRTC ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది.
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ వారి ముఖ్య గమనిక..
TGS RTC వివిధ రకాల బస్సులలో ప్రయాణికులను తమ యొక్క గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా వివిధ రకాల బస్సుల్లో సేఫ్టీ ప్రీకాషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లహరి, ఏ.సీ స్లీపర్, లహరి ఏ.సీ స్లీపర్ కం సీటర్, రాజధాని ఏ.సీ బస్సులలో వెనుక భాగంలో ఎమర్జెన్సీ డోర్‌ను, ఏదైనా కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు హ్యమర్స్, మంటలు ఆర్పుటకు ఫైర్ ఎక్స్టింగిషెర్, ప్రధానంగా డ్రైవర్ క్యాబిన్ దగ్గర మంటలను ఆర్పేందుకు ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్‌ను, మంటలను ఆర్పే పరికరం అమర్చబడ్డాయి.
ప్రయాణికులను అప్రమత్తం చేయుటకు సైరన్ పొందుపరచడం జరిగింది. సూపర్ లగ్జరీ బస్సుల్లో ఫైర్ ఎక్స్టింగిషర్, బస్సు వెనుక భాగంలో కుడి వైపు ఎమర్జెన్సీ డోర్ ఏర్పాటు చేయడం జరిగింది.. డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో కుడి వైపు వెనుక భాగంలో ఎమర్జెన్సీ డోర్, ఫైర్ ఎక్స్టింగిషెర్లు ఏర్పాటు చేయడం జరిగింది.
మీ ఆదరణ మాకు కొండంత అండా… ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం.. సుఖప్రదం.. శుభాకాంక్షలతో
మీ TGSRTC.
Previous articleసాయంత్రం EC కీలక ప్రెస్‌మీట్..
Next articleపేర్ల మార్పుపై కేబినెట్ సబ్‌కమిటీ కసరత్తు పూర్తి..