Rahul Dravid: రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో భారత జట్టుకు కొత్త కోచ్‌.. ?

0
వన్డే వరల్డ్ కప్‌ (World Cup)లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వన్డే వరల్డ్‌కప్‌ ముగిశాక భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్ రాబోతున్నాడా..? రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) స్థానంలో వీవీఎస్‌ లక్ష్మణ్‌‌ (VVS Laxman)ను నియమించబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
వన్డే వరల్డ్‌కప్‌ ముగిశాక భారత క్రికెట్‌ జట్టు ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. నవంబరు 23 నుంచి జరిగే ఈ సిరీస్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. వన్డే వరల్డ్‌కప్‌ మెగా టోర్నీతో ప్రస్తుత హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఒప్పందం ముగియనుంది.
దీంతో ద్రవిడ్‌ స్థానంలో పూర్తిస్థాయి కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే BCCI మరోసారి ద్రవిడ్‌ వైపు మొగ్గు చూపితే నిబంధనల ప్రకారం అతడిని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది. అయితే నిరంతర పర్యటనలు, పనిఒత్తిడి అధికంగా ఉండే ఈ బాధ్యతలను 51 ఏళ్ల ద్రవిడ్‌ ఆసక్తి చూపుతాడా అన్నది చూడాలి.
గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌కు కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్‌.. మరోసారి ఏదైనా ఫ్రాంచైజీకి కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleKCR Success: ఫలించిన కేసీఆర్ వ్యూహం.. ఒక్కటైన గులాబీ నేతలు..
Next articleEngland: మిగిలింది నాలుగే.. ఇక ఇంగ్లాండ్‌‌ ఇంటికే..?