ఆయనో నిఖార్సైన రైతు.. రైతు క్షేమం కోసమే ఎరువల షాప్ పెట్టిన వ్యక్తి. ఆయన అనుకుంటే ఎంతో విలాసవంతమైన జీవితం గడపగలడు. కానీ అవేమి కోరుకోలేదు. గ్రామ అభివృద్ధే ముఖ్యం అనుకున్నాడు. ఆయన ధ్యాసంత ప్రజలకు ఏదో చేయాలని.. ప్రజలను కష్టాల కడలి నుండి ఒడ్డుకు చేర్చాలని.. ఆ తపనతోనే దిగ్విజయంగా సాగుతున్న ఎరువుల షాపును, వ్యవసాయాన్ని పక్కనబెట్టి కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జననేత మన సుజాతమహేందర్ యాదవ్. ప్రజల కోసం, ప్రజల కొరకు ఎన్నో ఇబ్బందులను, ఆటంకాలను తట్టుకొని నిలబడ్డ నాయకుడు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మంచి మనసున్న మనిషి.
ఆయనకు చిన్నప్పటి నుండే ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేది. అందుకే ముందుగా వార్డు మెంబర్‌గా పోటీ చేసి బంపర్ మెజార్టీతో గెలిపొందాడు. ఇక అంతే వెనుతిరిగి చూసుకోలేదు. ప్రజల కోసం కష్టనష్టాలు ఎదురైన ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ప్రజాసేవకోసం కేసీఆర్, హరీశ్ రావు బాటలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.
సర్పంచ్ ఎన్నికల బరిలో మంచి అభ్యర్థి కోసం చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సుజాత మహేందర్ యాదవ్ రూపంలో నిఖార్సైన నాయకుడు దొరికాడు. యువనేత ప్రచారంలో దూసుకెళ్లడం మిగితా అభ్యర్థులకు మింగుడు పడడంలేదు. కానీ మహేందర్ యాదవ్ మాత్రం..ప్రజాసేవే శాశ్వతమని నమ్మాడు. తాను నమ్మిన దానిని ఆచరణలో పెట్టేందుకు ఇప్పటికీ అలుపెరగని కృషి చేస్తున్నాడు. కేసీఆర్, హరీశ్ రావులను ఆదర్శంగా తీసుకుని నమ్మిన పార్టీ కోసం, తనను నమ్మిన ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు.
అన్న అని పిలిస్తే తనను నమ్మిన వారికోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధపడతాడు మహేందర్ యాదవ్. రాజకీయ ప్రయాణం చిన్నదే అయినా జనంపై చెరగని ముద్ర వేశారు మహేందర్ యాదవ్. గుండ్లపల్లి గ్రామం మరింత అభివృద్ధి చెందాలంటే సుజాత మహేందర్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలించాలి. అప్పుడు గ్రామం అన్ని విధాల పురోగతి సాధిస్తుంది. కత్తెర గుర్తుకు ఓటెయ్యండి.. సుజాత మహేందర్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలింపించడి..