999కే జియో భారత్‌ 4జీ ఫోన్.. ఆకాశ్‌ అంబానీ లక్ష్యం నెరవేరేనా..?

0
ఇంటర్నెట్‌ ఆధారిత ‘జియో భారత్‌’ 4జీ ఫీచర్‌ ఫోన్లను జియో మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ ఫోన్‌ ధర రూ.999. నెలకు (28 రోజులకు) అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, 14 జీబీ (రోజుకు 0.5 జీబీ) డేటా కోసం రూ.123 చొప్పున రీఛార్జ్‌ చేసుకోవాలి. ఏడాదికి అయితే రూ.1234తో రీఛార్జ్‌ చేసుకుంటే ప్రతినెలా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు రోజుకు 0.5 జీబీ చొప్పున, ఏడాదికి 168 జీబీ డేటా లభిస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ నెల 7 నుంచి అమ్మకాలు మొదలు కానున్నాయి.
వేరే నెట్‌వర్క్‌ల నుంచి ఈ ఫోన్‌లోకి మారేందుకు మొబైల్‌ నంబరు పోర్టబులిటీ (MNP) సదుపాయం కూడా ఉంది. ఇతర ఫోన్లలోని జియో సిమ్‌ను కూడా ఈ ఫోన్‌లో వేసి వాడుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఉన్నంత వరకే, రూ.123 ప్లాన్‌ పనిచేస్తుంది.
‘2జీ ముక్త్‌ భారత్‌’ విజన్‌లో భాగంగా ఈ కొత్త మొబైల్‌ను ఆవిష్కరించినట్టు జియో తెలిపింది. దేశంలో ఇప్పటికీ 25 కోట్ల మంది ఇంటర్నెట్‌ సౌకర్యం లేని ఫీచర్‌ ఫోన్లనే ఉపయోగిస్తున్నారని.. వీరందరి కోసమే ఈ జియో భారత్‌ ఫోన్‌ను తెచ్చినట్టు జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ చెప్పారు.
అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, 2 జీబీ డేటా కోసం ఇతర సంస్థలు నెలకు రూ.179 వసూలు చేస్తుండగా, తాము 30 శాతం తక్కువగా రూ.123 ప్లాన్‌ తెచ్చామని, 7 రెట్లు అధికంగా డేటా అందిస్తున్నట్లు జియో తెలిపింది.

కేంద్ర కేబినెట్‌లోకి “ఆ ఇద్దరు”.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleకేంద్ర కేబినెట్‌లోకి “ఆ ఇద్దరు”.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
Next articleBJP MLA రఘునందన్‌పై చర్యలు తప్పవా.. పార్టీ మారితే పోటీ అక్కడే..?