మహేష్ బాబు- రాజమౌళిల మూవీ #SSMB29 నుంచి ఈ నెలలో అప్‌డేట్ రాబోతుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్‌తో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా ఇదే అంశంపై X వేదికగా రాజమౌళిని అడగడం.. అయన కూడా రిప్లై ఇవ్వడంతో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. మధ్యలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా రియాక్ట్ కావడంతో సినిమా ప్రమోషన్స్ ఇలా కూడా చేస్తారా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.





