SSMB29: మరో అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి..

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తోన్న మూవీ #SSMB29. దీనికి సంబంధించిన #GlobeTrotter ఈవెంట్‌ ఈనెల 15న జరగనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ రోజు టైటిల్ అనౌన్స్ చేస్తారా.. లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ అంతకంటే ముందే రాజమౌళి మరో అప్‌డేట్ ఇచ్చేశారు.
ఈ మూవీలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఇవాళ పృథ్వీరాజ్‌ లుక్‌ను విడుదల చేయనున్నట్లు రాజమౌళి ట్వీట్ చేశారు.
#SSMB29 మూవీలోని మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్‌ షూట్‌ జరుగుతోంది. మరోవైపు #GlobeTrotter ఈవెంట్‌ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్‌ 15న మీరంతా ఈ ఈవెంట్‌ను చాలా ఎంజాయ్‌ చేస్తారు. దానికంటే ముందు ఇవాళ పృథ్వీరాజ్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్ కానుందని రాజమౌళి X వేదికగా పోస్ట్‌ చేశారు.
నవంబర్‌ 15న రామోజీ ఫిల్మ్‌ సిటీ (#RamojiFilmCity) వేదికగా గ్రాండ్‌ ఈవెంట్‌ ప్లాన్ చేశారు. #GlobeTrotter  ఈవెంట్‌లో #SSMB29 మూవీ టైటిల్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌ జియోహాట్‌ స్టార్‌ (JioHotstar)లో స్ట్రీమింగ్‌ కానుంది.

https://x.com/ssk1122/status/1986060604441043135?t=JId4AAhkqZP_g7BP0UwGyA&s=19

Previous articleBreaking: ఆ వీడియోలతో తెలుగు నటికి లైంగిక వేధింపులు.. మేనేజర్ అరెస్ట్..
Next articleకాలినడకన ప్రతి చెట్టు పరిశీలించిన పవన్ కల్యాణ్