TPCC చీఫ్ ఎంపిక అంశం కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. ఓవైపు రేసులో ఉన్న నేతలు తమ ప్రయత్నాల్లో బిజీగా ఉంటే.. మరోవైపు VH లాంటి సీనియర్లు అయితే TPCC అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి మాత్రం ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డికి TPCC అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్‌ను వీడేందుకు కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు, మనీ ల్యాండరింగ్, భూ కబ్జా కేసులు ఉన్నాయని.. అలాంటి వ్యక్తి అధ్యక్షుడైతే అందరం జైలు చుట్టూ తిరగాలా అని VH ప్రశ్నించారు.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెర్షన్ మాత్రం మరోలా ఉంది. TPCC చీఫ్ ఎంపిక అంశంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన ఏకంగా లేఖ రాశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలని కోరారు. TPCC చీఫ్ ఎంపికలో సీనియర్ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఏకాభిప్రాయంతోనే TPCC చీఫ్ పేరును ప్రకటించాలని లేఖలో స్పష్టం చేశారు.
నిన్న ఇంచార్జ్ ఠాగూర్‌పై VH చేసిన ఆరోపణలపై ఇప్పటికే అధిష్టానం సీరియస్ అయింది. వీహెచ్‌కు షోకాజ్ నోటీసులు కూడా ఇస్తారని తెలుస్తోంది. వీహెచ్ సమాధానాన్ని బట్టి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
రేపో, మాపో TPCC చీఫ్‌గా రేవంత్ రెడ్డి పేరును ప్రకటిస్తారన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతల కామెంట్లు హీటెక్కిస్తున్నాయి. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిని రేపుతోంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com