మంత్రి కేటీఆర్‌పై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. జన్వాడలో జీవో 111ను ఉల్లంఘించి కేటీఆర్ విలాసవంతమైన ఫాంహౌస్ నిర్మాణం చేపట్టారన్నారు. కేటీఆర్ లీజుకు తీసుకున్నాడని బాల్క సుమన్ చెబుతున్నాడని.. అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్ ట్వీట్ చేశారని రేవంత్ గుర్తు చేశారు. కేటీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారన్న టీఆర్ఎస్ నేతల ఆరోపణలపై కూడా రేవంత్ స్పందించారు. తమకు భూమి ఉన్న మాట వాస్తవమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ భూమిలో తాను అక్రమంగా ఒక్క అంగుళంలో నిర్మాణం చేపట్టినా.. కూలగొట్టేందుకు తాను సిద్ధమేనని, తన లాగా కేటీఆర్ కూడా అక్రమ నిర్మాణాలను కూలగొట్టగలరా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నిన్న ప్రెస్‌మీట్ పెట్టి విమర్శించిన టీఆర్‌ఎస్ నేతలను మిడతల దండుగా ఆయన అభివర్ణించారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.