రాష్ట్రంలో ప్రస్తుతం దుబ్బాక హీట్ నెలకొంది. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతిచెందడంతో ఉపఎన్నిక పోరు రసవత్తరంగా సాగనుంది. నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. టీఆర్ఎస్ తరుపున టికెట్ కోసం పలువురు ఆశావాహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీలొని కొందరు వాదనలు వినిపిస్తుండగా.. మరికొందరు మాత్రం రంగయ్యగారి రాజిరెడ్డికి టికెట్ ఇవ్వాలని అంటున్నారు.
టీఆర్ఎస్ రెబల్ టీం అధినేత అయినా రంగయ్యగారి రాజిరెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఆయన నిత్యం ప్రజల్లోకి వెళ్లి వాళ్ల కష్టాలను తెలుసుకుంటారు. విన్నవాటిని అక్కడితో వదిలేయకుండా పరిష్కరించేందుకు వెంటనే రంగంలోకి దిగుతారు. ఏదిఏమైన ప్రజాసంక్షేమమే ఆయన నినాదం. ఇప్పటికే ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకుని వారికి అండగా నిలిచారు. సామాన్యులకు మంచి జరుగుతుందంటే చాలు అది ఎంత కష్టమైన భరించే నైజం రాజిరెడ్డి సొంతం. ఆటంకాలు ఎదురైన, అవాంతరాలు అడ్డొచ్చిన తాను నమ్మిన బాటలోనే నడుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్నారు రాజిరెడ్డి.
ఉపఎన్నిక పోరులో మిగితా పార్టీలను తట్టుకుని టీఆర్ఎస్ నెగ్గాలంటే రాజిరెడ్డి వల్ల మాత్రమే సాధ్యమని పలువురు అంటున్నారు. ఒకవేళ పార్టీ టికెట్ ఇవ్వకున్న రెబల్ గా పోటీచేస్తానని చెబుతున్నారు రాజిరెడ్డి. నియోజకవర్గంలోని ప్రతి పేదవాడిని ఆదుకోవడమే తన లక్ష్యమని..దానికోసం ఎంత వరకైనా పోరాడతానన్నారు. ప్రజల అండతో తాను ఎన్నికల్లో గెలవడం ఖాయమని రంగయ్యగారి రాజిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Your article helped me a lot, is there any more related content? Thanks!