BJP రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరి రాకేష్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతారా.. కాంగ్రెస్‌లో చేరుతారా.. లేదా ఇండిపెండెంట్‌గా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా.. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాకేష్ రెడ్డితో బీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థి కడియం శ్రీహరి సమావేశమయ్యారు. బీఆర్ఎస్‌లోకి రావాలని రాకేష్ రెడ్డిని ఆహ్వానించారు. మరోవైపు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాకేష్ రెడ్డికి ఫోన్ చేసినట్లు తెలిసింది. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
రెండు ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానం రావడంతో రాకేష్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.
బీజేపీకి బిగ్ షాక్.. రాకేష్ రెడ్డి రాజీనామా.. కిషన్ రెడ్డికి పలు ప్రశ్నలు