IAS అమ్రపాలికి మరో అరుదైన అవకాశం..

2
IAS అమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం (PMO)లో తాజాగా నియమితులైన ముగ్గురు IASల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. PMOలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన అమ్రపాలి.. 2023 అక్టోబర్‌ 27 వరకు కొనసాగనున్నారు. అమ్రపాలితో పాటు PMOలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన IAS అమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా JCగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అమ్రపాలి సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించిన అమ్రపాలి చెన్నై IIT నుంచి బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని IIM నుంచి MBA పూర్తి చేశారు. 2010లో ఆమె IASగా ఎంపికయ్యారు. వరంగల్ కలెక్టర్‌గా సేవలందించిన సమయంలో ఆమె చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు.
అలాగే, PMOలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) IAS అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ PMO అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleబిగ్ బాస్ కు IPL సవాల్.. ఎలా అంటే..?
Next articleఆ ఒక్క భూకంపం మోదీ జీవితాన్నే మార్చేసింది.. ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది..

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here