ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో తొలిసారి పర్యటించనున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ టూర్‌లో భాగంగా ఆయన ఢిల్లీ, అహ్మదాబాద్‌లను సందర్శించనున్నారు. ఇప్పటికే ట్రంప్ టూర్ నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, రెండో రోజు (ఈ నెల 25న) పర్యటనలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇచ్చే విందుకు ఆయన హాజరుకానున్నారు. ఈ విందు కోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా రాష్ట్రపతి ఆహ్వానం పంపించినట్టు సమాచారం.
ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికే ఆహ్వానం అందినట్టు తెలిసింది. ఈ మేరకు ఈనెల 25న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు మహారాష్ట్ర, హర్యానా, ఒడిశా, బీహార్, కర్ణాటక ముఖ్యమంత్రులకు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్టు సమాచారం.
కాగా, ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ అహ్మదాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ ట్రంప్ దంపతులకు ప్రధాని మోడీ స్వయంగా ఆహ్వానం పలుకుతారు. అనంతరం మోడీ, ట్రంప్.. రోడ్ షో ద్వారా మొతేరా స్టేడియం చేరుకుంటారు. ఆ సమయంలో దాదాపు లక్ష మంది ప్రజలు ట్రంప్‌కు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి మధ్యాహ్నం 12.30గంటలకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో ట్రంప్, మోడీ ప్రసంగిస్తారు.
అహ్మదాబాద్‌లో మూడు గంటల పాటు సాగే ట్రంప్ పర్యటన కోసం గుజరాత్ ప్రభుత్వం దాదాపు రూ.100కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.