ఎన్నికల్లో పోటీపై జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (PK) కీలక ప్రకటన చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను వ్యక్తిగతంగా పోటీ చేయట్లేదని చెప్పారు. పార్టీ కోసం ఈ ఎన్నికల్లో పనిచేస్తానన్నారు. పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానన్నారు. ఈ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని PK ధీమా వ్యక్తం చేశారు.
బిహార్ సీఎం నితీష్ కుమార్ మళ్లీ సీఎం కాలేరన్నారు ప్రశాంత్ కిశోర్. JDU పార్టీకి ఈ ఎన్నికల్లో 25 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. NDAతో పాటు ఇండి కూటమి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా లేదన్నారు.
మరోవైపు ఓటమి భయంతోనే ప్రశాంత్ కిశోర్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని NDA, ఇండి కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా జరగనుంది. నవంబర్ 6న తొలి విడత, 11న రెండో విడత పోలింగ్‌కు CEC ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహిస్తారు.