తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల పరస్పర ఆరోపణలతో మాటల యుద్ధం సాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు టీఆర్ఎస్ నేతలు. రేవంత్ బాగోతాలు ఒక్కొక్కటిగా రేపటి నుంచి బయటపెడతామని గులాబీ లీడర్లు హెచ్చరించారు. అయితే “ముందుంది ముసళ్ల పండుగ.. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు” అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన ఫాంహౌస్ విషయంలో ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి స్పందించారు. ఓటుకు నోటు కేసులో బుక్కైన రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను రాజీనామా చేయమనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ నిజాయితీ పరుడని.. అవినీతి చేశాడని నిరూపిస్తే, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తానని సవాల్ చేశారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com