కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన PhonePe.. చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్

0
మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోస్టర్ వార్‌ మొదలైంది. అయితే కాంగ్రెస్‌ పార్టీపై మాత్రం సీరియస్ అయింది ఫోన్‌పే ( PhonePe ) సంస్థ. కాంగ్రెస్ వేసిన పోస్టర్లపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పోస్టర్ వార్‌‌కు PhonePeతో ఏంటి సంబంధం అనుకుంటున్నారా.. ?
ఈ పోస్టర్లలో మధ్యప్రదేశ్‌ CM శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ (Shivraj Singh Chouhan) ఫొటోలు, క్యూఆర్‌ కోడ్స్‌ ఉన్నాయి. అంతేకాకుండా ఫోన్‌పే (PhonePe) బ్రాండ్ నేమ్‌, లోగోను కూడా ఉపయోగించారు. ఈ పోస్టర్లను మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్ తన ట్విట్టర్ అకౌంట్‌లోనూ షేర్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పని జరగాలంటే 50 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించింది. ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కర్ణాటక తరహాలో కాంగ్రెస్ (Congress) ఈ పోస్టర్లను ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ వేసిన పోస్టర్లలో ఫోన్‌పే (PhonePe) లోగోను వాడటంపై ఆ సంస్థ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్న ఫోన్‌పే సంస్థ.. పోస్టర్లు, బ్యానర్ల నుంచి ఫోన్‌పే (PhonePe) లోగోను తొలగించాలని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌కు సూచించింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleతెలంగాణ BJPలో కీలక మార్పులు.. బండి సంజయ్‌కి ప్రమోషన్.. ప్రకటనే మిగిలింది!
Next articleకేంద్ర కేబినెట్‌లోకి “ఆ ఇద్దరు”.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..