మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. లెటెస్ట్‌గా జాన్వీ పాత్రకు సంబంధించిన లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు.
అచ్చియ్యమ్మ పాత్రలో జాన్వీ కపూర్ కనిపించనుందని తెలియజేస్తూ మూవీ టీమ్ రెండు స్టిల్స్‌ను రిలీజ్ చేసింది.

ఓ పోస్టర్‌లో జీపు మీదెక్కి రెండు చేతులెత్తిన జాన్వీ.. మరో పోస్టర్‌లో మైక్ పట్టుకొని పాట పాడటానికి రెడీగా ఉన్న సింగర్‌గా కనిపిస్తోంది. ఈ మూవీలో దేనికీ భయపడని అమ్మాయిగా జాన్వీ రోల్ ఉంటుందని పోస్టర్లు, మూవీ టీమ్ పెట్టిన క్యాప్షన్ బట్టి తెలుస్తోంది.
రామ్‌చరణ్- బుచ్చిబాబు కాంబినేషన్‌కు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ యాడ్ కావడంతో మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ నెల 8న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సెర్ట్‌లోనే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది మూవీ రిలీజ్ కానుంది.
ఉప్పెన (Uppena) తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న మూవీ ఇదే.