లోక్‌సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం దేశానికి ఎంతో అవసరమని ఇటీవల స్పీకర్ల సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. సంబంధిత చట్టాలను సవరిస్తే జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) సునీల్ అరోరా స్పష్టం చేశారు. దీంతో ఒకే దేశం..ఒకే ఎన్నికపై మరోసారి చర్చ మొదలైంది. అసలు దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా? ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల లాభమా.. నష్టమా..?
వాస్తవానికి మనదేశంలో జమిలి ఎన్నికల నిర్వహించడం కొత్తేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికల నుంచి 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే తర్వాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవటం, గడువుకు ముందే పలు రాష్ర్టాల అసెంబ్లీలను బర్తరఫ్ చేయటం వంటి కారణాలతో జమిలి ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపటం మొదలైంది.
జమిలి ఎన్నికలతో ప్రయోజనాలేంటి..?
* తరచూ ఎన్నికల కోడ్ అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించే వీలు.
* ఎన్నికల వ్యయం తగ్గుతుంది.
* అవినీతి, నల్లధనానికి అడ్డుకట్ట.
* ఓటింగ్ శాతం పెరుగుతుంది.
జమిలి ఎన్నికల వల్ల ప్రతికూలతలేంటి..?
* ప్రభుత్వాలు మధ్యలోనే కూలిపోతే, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేకపోతే ఏమవుతుంది..?
* జాతీయ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే లోక్‌సభ ఎన్నికలతో శాసనసభ ఎన్నికలు కలిపితే స్థానిక అంశాలు మరుగున పడే అవకాశం.
* భారీ ఎత్తున సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్ల అవసరం.
జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం..?
* చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు జరపటం వల్ల జాతీయ పార్టీలకే లాభిస్తుందని, ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జమిలి ఎన్నికల విధానం అమల్లో ఉంది. స్వీడన్, ఇండొనేషియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, స్పెయిన్, హంగరీ, బెల్జియం, పోలాండ్, స్లోవేనియా, అల్బేనియా తదితర దేశాల్లో చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి.
Your article helped me a lot, is there any more related content? Thanks!
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.