OG నాలుగు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

పవన్‌ కల్యాణ్‌ నటించిన OG సినిమా నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.252+ కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రకటించింది. సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ విడుదల చేసింది.

https://www.facebook.com/share/p/1BVmUSH8jB/

OG విడుదలైన రోజే రూ.154 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఫస్ట్‌ డే అత్యధిక వసూలు చేసిన టాప్‌-10 భారతీయ సినిమాల జాబితాలో ‘ఓజీ’ చోటు దక్కించుకుంది. టాలీవుడ్ నుంచి ఏడో మూవీ.
కొన్నాళ్లుగా అభిమానులు పవన్‌ నుంచి ఎలాంటి సినిమానైతే ఆశించారో అదే ‘ఓజీ’. సుజీత్‌ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా మూవీలో పవన్‌.. ఓజస్‌ గంభీరగా నటించారు.
Previous articleRTC MDగా నాలుగేళ్ల ప్రయాణంపై సజ్జనార్
Next articleచేసింది చాలు.. ఇక కప్ ఇచ్చేయండి