ఎల్లుండే తొలి సెమీస్‌ మ్యాచ్.. ఆ ఇద్దరినే వదిలేసిన రోహిత్‌ శర్మ

0
వన్డే వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది సెమీస్‌కు సిద్ధమైంది. ఎల్లుండి జరిగే తొలి సెమీస్‌లో భారత్‌.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది మంది బౌలర్లను ఉపయోగించాడు. భారత జట్టులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా అందరూ బౌలింగ్ చేశారు. భారత బౌలర్లలో బూమ్రా, సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జడేజా తలో రెండు వికెట్లు తీయగా, కోహ్లీ, రోహిత్‌ శర్మ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

వన్డేల్లో విరాట్‌ కోహ్లి తొమ్మిదేళ్ల తర్వాత వికెట్‌ తీశాడు. వన్డేల్లో విరాట్‌కు ఇది ఐదో వికెట్‌. విరాట్‌ తన వన్డే కెరీర్‌లో అలిస్టర్‌ కుక్‌, కీస్వెట్టర్‌, డికాక్‌, మెక్‌కల్లమ్‌, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ల వికెట్లు పడగొట్టాడు. విరాట్‌ టీ20ల్లో (4), ఐపీఎల్‌లోనూ (4) వికెట్లు పడగొట్టాడు.

రోహిత్‌ శర్మ బౌలింగ్‌లో తేజ నిడమనూరు షమికి క్యాచ్ ఇవ్వడంతో నెదర్లాండ్స్ ఆలౌటైంది. వరల్డ్‌కప్‌లో రోహిత్‌కిది తొలి వికెట్ కావడం విశేషం.
ఒకే సంవత్సరంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టించాడు. 2015లో ఏబీ డివిలియర్స్‌ 58 సిక్స్‌లు కొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది రోహిత్ 60 సిక్స్‌లతో ఆ రికార్డును అధిగమించాడు. ఈ వరల్డ్‌ కప్‌లోనే హిట్‌మ్యాన్‌ 24 సిక్స్‌లు బాదడం విశేషం. కెప్టెన్‌గా ఒక వరల్డ్‌ కప్‌లో అత్యధిక సిక్స్‌ల రికార్డును ఇప్పటికే రోహిత్ అధిగమించాడు. 2019లో ఇంగ్లాండ్‌ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 22 సిక్స్‌లు కొట్టాడు.
వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలోనే భారత్‌ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ రికార్డుల్లోకెక్కాడు. రాహుల్‌కు ముందు ఈ రికార్డు రోహిత్‌ శర్మ పేరిట ఉండేది.
ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు (16 వికెట్లు) పడగొట్టిన భారత స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు (అనిల్ కుంబ్లే 15 వికెట్లు, 1996), యువరాజ్ సింగ్ (15 వికెట్లు, 2011) పేరిట ఉండేది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleమెదక్‌‌లో పోటీ నుంచి తప్పుకుంటారా.. మైనంపల్లి వ్యూహమేంటి..?
Next articleతెలంగాణలో భారీగా నామినేషన్లు.. కానీ అతి తక్కువగా అక్కడే..