ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో..?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. 13న ఓట్లు లెక్కిస్తారు. అయితే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో సాయంత్రం క్లారిటీ రానుంది. ఇప్పటికే నామినేషన్లు పరిశీలించిన అధికారులు వివిధ కారణాలతో పది వేల నామినేషన్లను తిరస్కరించారు.
నామినేషన్ల ఉపసంహరణకు గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు అసంతృప్తులను బుజ్జగిస్తున్నాయి. దీంతో తుది పోరులో ఎంతమంది మిగులుతారన్నది సాయంత్రం తేలనుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం 29,694 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 10,086 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతానికి 19,608 నామినేషన్లు మిగిలాయి. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసి ఉంటే పరిశీలన సమయంలో వాటిని అధికారులు తొలగించారు.
మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే కొందరు ప్రచారం మొదలుపెట్టారు. వీరిలో చాలా మంది పోటీ చేస్తున్నారు. అయితే వాస్తవంగా బరిలో ఎవరుంటారన్నది ఇవాళ తేలనుంది. ఆ తర్వాత ప్రచారం మరింత జోరుగా సాగనుంది.
Previous articleమేడారం మహా జాతర మంగ్లీ సాంగ్