తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌లకు ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. కోవిడ్ పరిస్థితులు, కట్టడి చర్యల గురించి సీఎంలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కరోనాను కట్టడి చేసేందుకు ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుకున్నట్లు తెలిసింది. అదే విధంగా ప్రధాని మోడీ.. కరోనా నియంత్రణ, తదితర అంశాలపై సీఎంలకు పలు సూచనలు చేసినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు తమిళనాడు, బీహార్, అసోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సీఎంలతో కూడా ప్రధాని ఫోన్‌లో మాట్లాడి కరోనా తీవ్రత గురించి తెలుసుకున్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com