హైదరాబాద్‌లో హాస్టళ్లు ఖాళీ చేయించడంపై మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు..

1
హైదరాబాద్‌లో హాస్టల్‌ విద్యార్ధులు, ఉద్యోగులను ఉన్న పళంగా ఖాళీ చేయించడంపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఉద్యోగులు, విద్యార్ధులు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. హాస్టళ్లు ఖాళీ చేయించడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు లేక కొందరు, NOC కోసం పోలీస్ స్టేషన్‌ల ముందు క్యూ కట్టారు. ప్రభుత్వం తమ ఇబ్బందులపై స్పందించాలని విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హాస్టల్, పేయింగ్‌ గెస్ట్‌హౌస్ నిర్వహకులకు ఆయన కీలక సూచనలు చేశారు. ఏ ఒక్కరినీ కూడా హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించవద్దని, అనవసరంగా భయాందోళనను సృష్టించవద్దని నిర్వాహకులను కోరారు.

ఇప్పటికే ఇదే విషయంపై GHMC కమిషనర్, మేయర్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో చర్చించానని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధులు, మేయర్, డిప్యూటీ మేయర్‌, స్థానిక కార్పొరేటర్లు తమ ప్రాంతంలో ఉన్న హాస్టళ్లకు సంబంధిత అధికారులతో వెళ్లి ఈ సమాచారాన్ని విద్యార్థులకు, నిర్వాహకులకు చేరవేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

కరోనా కట్టడి కోసం ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleనీకు ఆ పదవి ఇస్తాం..మాతో కలువు.. ప్రభుత్వాన్ని కూల్చేద్దాం.. అయితే ఒకే
Next article“సార్ Vs బ్రదర్”- వైరల్‌గా మారిన కేటీఆర్, పవన్ కల్యాణ్ ట్వీట్స్..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here