ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి ప్రారంభంకానుంది. ఈ క్రమంలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని భక్తుల ఇంటి దగ్గరే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను, TGSRTC VC & MD వై. నాగిరెడ్డి ప్రారంభించారు. అందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కేవలం రూ.299 చెల్లించడం ద్వారా, మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని భక్తులు తమ ఇంటి దగ్గరే పొందవచ్చు.
భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్సైట్లో లాగిన్ ద్వారా లేదా సమీపంలోని TGSRTC లాజిస్టిక్స్ కౌంటర్లలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం, TGSRTC కాల్ సెంటర్ను 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించవచ్చు.