ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మే 22న నియమితులయ్యారు.
తైవాన్ అధ్యక్షురాలిగా తై ఇంగ్ వెన్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. కొవిడ్-19ను కట్టడి చేయడంలో సఫలమైన తై ఇంగ్ వెన్ ఆ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు. 2020 జనవరిలో ఎన్నికైన ఆమె డెమెక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మే 20న రెండోసారి అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా 2016లో ఎన్నికయ్యారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) లేడీస్ ఆర్గనైజేషన్‌కు 37వ నేషనల్ ప్రెసిడెంట్‌గా జాహ్నబి ఫుకాన్ ఎన్నికయ్యారు.
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకుకు నూతన ఉపాధ్యక్షురాలిగా కోర్మన్ రీన్‌హర్ట్ ఎంపికయ్యారు. జూన్ 15న ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను (44.2 టెరా బైట్/సెకండ్) ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
భారత్-నేపాల్ మధ్య వివాదం కొనసాగుతున్న లిపులేఖ్, కాలాపానీ, లింపియుధుర భూ భాగాలు తమవేనని నేపాల్ తమ కొత్త మ్యాప్‌లో చూపించింది. లిపులేఖ్ కనుమ గుండా భారత్ రోడ్డును నిర్మించిందని నేపాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా అక్షరాస్యత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం “పఢ్‌నా లిఖ్‌నా అభియాన్” పథకానికి మే 17న శ్రీకారం చుట్టింది. పదేండ్ల పాటు కొనసాగిన సాక్షర భారత్‌ను రద్దు చేసిన కేంద్రం దాని స్థానంలో ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
వ్యర్థాల (గార్బేజ్) నిర్వహణలో సమర్థంగా వ్యవహరించిన నగరాలకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మే 19న ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 6 నగరాలకు 5 స్టార్, 65 నగరాలకు 3 స్టార్, 70 నగరాలకు వన్ స్టార్‌ను ఇచ్చారు.
చార్‌ధామ్ యాత్రను సులభతరం చేయడంలో భాగంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చంబా టన్నెల్‌ను నిర్మించింది. చార్‌ధామ్ మహమార్గ్ వికాస్ పరియోజనలో భాగంగా నేషనల్ హైవే 94పై రిషికేశ్- దరాసుల మధ్య చంబా వద్ద 440 మీటర్ల పొడవుతో ఈ టన్నెల్‌ను నిర్మించింది. 2020 అక్టోబర్ నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
బిహార్‌లోని పాట్నా స్కూల్ విద్యార్థి, భారత సంతతి ఆర్థికవేత్త, సింగపూర్‌కు చెందిన అబ్బాస్ ఝాను దక్షిణాసియాలో వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ పరిశీలకుడిగా ప్రపంచ బ్యాంకు నియమించింది. ఇండియాలో 12 ఏళ్ల పాటు IASగా సేవలందించిన అబ్బాస్ 2001 నుంచి ప్రపంచ బ్యాంకులో కొనసాగుతున్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.