(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) RCB అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే RCB.. IPL ఫస్ట్ సీజన్ నుంచి RCB ఫ్రాంచైజీకే ఆడుతున్న విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా, ప్లేయర్‌గా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వచ్చే సీజన్‌లో కోహ్లీ RCBకి గుడ్‌బై చెప్తాడని ప్రచారం జరుగుతోంది. RCB కమర్షియల్ కాంట్రాక్ట్‌ను కోహ్లీ రిజెక్ట్ చేశాడని చెప్తున్నారు. దీంతో కోహ్లీ IPLలో ఆడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గత ఏడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ.. ఈ ఏడాది ప్రారంభంలో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు IPLకు కూడా రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. IPLలో 8 వేలకుపైగా రన్స్ చేసిన కోహ్లీ.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గానూ కొనసాగుతున్నాడు. అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ప్లేయర్ కూడా కోహ్లీనే. 2016 IPLలో 973 పరుగులు చేసి ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.
చివరి సారిగా IPLలో కనిపించిన కోహ్లీ నాలుగు నెలల తర్వాత మళ్లీ గ్రౌండ్‌లో అడుగుపెట్టబోతున్నారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాపై మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాడు.