Kavitha: సీఎం రేవంత్ రెడ్డికి కవిత వార్నింగ్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు. తన రాజీనామా ఆమోదం గురించి చైర్మన్‌తో చర్చించారు. తన రాజీనామాకు కారణాలను సభలో చెప్పే అవకాశం ఇవ్వాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఈనెల 5, 6 తేదీల్లో ఏదో ఒకరోజు అవకాశం ఇస్తానని మండలి చైర్మన్ చెప్పారు.
కేసీఆర్‌ను టెర్రరిస్ట్‌తో పోల్చుతూ సీఎం రేవంత్ చేసిన విమర్శలకు తన రక్తం మరుగుతోందన్నారు కవిత. ముఖ్యమంత్రి తన మాట తీరు మార్చుకోవాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నది నూటికి వెయ్యి శాతం వాస్తవమన్నారు. ఇన్ టేక్ పాయింట్ ఎందుకు మార్చారో కేసీఆర్  వివరించాలన్నారు. KCR అసెంబ్లీకి రాకపోతే BRSను దేవుడు కూడా కాపాడలేడన్నారు.
రాళ్లతో కొట్టాలి, ఉరి తీయాలంటూ మాట్లాడటమంటే అవి CM స్థాయి వ్యక్తి మాటల మాదిరిగా లేవన్నారు కవిత. కేసీఆర్ ఉద్యమ ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నామని కవిత గుర్తు చేశారు. కేసీఆర్‌పై సీఎం చేసే విమర్శలు సరికాదన్నారు.
బబుల్ షూటర్ లాంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి జవాబు చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదన్నారు కవిత. అసలు బబుల్ షూటర్ వల్లే ట్రబుల్ వచ్చిందని.. బబుల్ షూటర్ కారణంగానే మొదటి ప్యాకేజీకి దెబ్బ పడిందన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. అనుకోకుండా అందలం ఎక్కిన వ్యక్తితో కేసీఆర్ మాటలు పడాల్సిన అవసరం లేదన్నారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా పాలమూరు- రంగారెడ్డి ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నారు కవిత. మాట్లాడితే పాలమూరు బిడ్డను అని ప్రగల్భాలు పలికే సీఎం ఎందుకు నీళ్లు ఇవ్వలేదో చెప్పాలన్నారు.
Previous articlePawan Kalyan: రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్..
Next articlePawan Kalyan: ఇచ్చిన మాట ప్రకారం పవన్ కల్యాణ్..