జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజే 10 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు BJP, BRS, కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
రహ్మత్ నగర్‌లో నిర్వహించిన BRS కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారంటూ ఆరోపించారు. వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించారన్నారు. దేశం అంతటా ఓట్ చోరీ అంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో జరుగుతోన్న ఓట్ల చోరీపై దృష్టి పెట్టాలన్నారు.
జూబ్లీహిల్స్‌లో ఫేక్ ఓట్ల వ్యవహారాన్ని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణణ్ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు ఆరోపణలను సుమోటోగా తీసుకుని యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని కృష్ణా నగర్‌లో హౌస్ నెం.8-3-231/B/160లో ఇటీవల నమోదైన 43 ఓట్లపై విచారణకు ఆదేశించారు.