రేపే జూబ్లీహిల్స్ రిజల్ట్.. ఎవరు గెలిచినా..

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌కు EC ఏర్పాట్లు పూర్తిచేసింది. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌తో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 407 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్‌ పూర్తికానుంది. కౌంటింగ్‌కు మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించారు. మధ్యాహ్నంలోపే ఫలితం తేలనుంది.
ఓట్ల లెక్కింపు కేంద్రం దగ్గర 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని.. అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం దగ్గరికి రావాలని పోలీసులు సూచించారు.
నియోజకవర్గంలో మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 4 లక్షల 13 వందల 65 ఓట్లకు సగం ఓట్లు కూడా పోలవ్వలేదు. నియోజకవర్గంలో  లక్షా 94 వేల 631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
దాదాపు నెల రోజుల పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్, BRS, BJP నేతల మధ్య పరస్పర విమర్శలతో మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. ఈ నెల 11న పోలింగ్ ముగిసినా.. BRS, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. రేపు ఫలితం ప్రకటించాక రాష్ట్రంలో పొలిటికల్ హిట్ మరింత పెరగనుంది.
Previous articleSachin: ముంబై ఇండియన్స్ నుంచి ఔట్
Next articleతెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు!