IPL ఆక్షన్‌కు BCCI రెడీ.. ఫ్రాంచైజీలకు డెడ్‌లైన్

వచ్చే సీజన్ IPLకు సంబంధించిన ఆక్షన్‌కు BCCI ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్‌ రెండో వారం లేదా మూడో వారంలో ఆక్షన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 13 నుంచి 15 మధ్య బీసీసీఐ వేలం ప్రక్రియను నిర్వహించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వేలానికి ముందు ప్లేయర్ల రిటెన్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. ప్లేయర్ల రిటెన్షన్‌కు BCCI నవంబర్ 15 వరకు డెడ్‌లైన్ పెట్టినట్టు తెలిసింది. ఆ లోపు ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్ల వివరాలను అందజేయాలని బోర్డు ఆదేశించినట్టు చెప్తున్నారు.
గత రెండు సీజన్ల వేలం ప్రక్రియ విదేశాల్లో జరిగింది. 2023లో దుబాయ్‌లో నిర్వహించగా.. గతేడాది సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించారు. ఈసారి మాత్రం భారత్‌లోనే వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. ముంబైలో నిర్వహించాలని BCCI నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గత సీజన్‌లో రిషభ్ పంత్ రూ.27 కోట్లతో అత్యధిక ధర పలకగా.. శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
Previous articleట్రంప్‌కి నోబెల్ అందుకే రాలే
Next articleహైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం