వచ్చే సీజన్ ఐపీఎల్ (IPL) కోసం ఆటగాళ్ల వేలానికి డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబరు 19న ఈ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తొలిసారిగా ఈ వేలాన్ని విదేశాల్లో నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇందుకు దుబాయ్ వేదిక కానుందని ఐపీఎల్ వర్గాల సమాచారం. ఈసారి ఫ్రాంచైజీలు వెచ్చించే సొమ్మును కూడా పెంచినట్టుగా తెలుస్తోంది. గతేడాది వరకు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సదరు ఫ్రాంచైజీ వెచ్చించే సొమ్ము రూ. 95 కోట్ల వరకు ఉండేది. కానీ, ఈసారి ఆ మొత్తాన్ని రూ. 100 కోట్లకు పెంచినట్టు తెలిసింది. అలాగే, మహిళల ప్రీమియర్ లీగ్ కోసం వేలాన్ని డిసెంబరు 9న నిర్వహిస్తారని తెలిసింది.