వరుస ఓటములు.. భారత్ సెమీస్ చేరాలంటే..

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు మరో షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైన హర్మన్‌ప్రీత్‌ సేన.. నిన్న ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వరుసగా రెండు మ్యాచుల్లో భారత్‌ ఓడడంతో సెమీస్‌ అవకాశాలను ప్రమాదంలో పడేసుకుంది. ఇంకా మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 8 టీమ్‌లు బరిలోకి దిగాయి. ఒక్కో జట్టు లీగ్‌ స్టేజ్‌లో ఏడు మ్యాచులు ఆడుతాయి. భారత్‌ ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడి.. రెండు గెలిచింది. మరో రెండు మ్యాచుల్లో ఓడింది. ఇప్పటివరకు నాలుగు పాయింట్లు సాధించింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో మూడో ప్లేస్‌లో ఉంది.
పాయింట్స్ టేబుల్‌లో టాప్‌-4లో నిలిచిన జట్లే సెమీస్‌కు చేరుకుంటాయి. అయితే మిగిలిన మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో భారత్ తలపడాల్సి ఉంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచిన ఇంగ్లాండ్‌తో ఆదివారం భారత్‌ తలపడనుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడితే మాత్రం సెమీస్‌ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి.
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియా (7 పాయింట్లు), ఇంగ్లాండ్ (6), భారత్ (4), దక్షిణాఫ్రికా (4) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (2), బంగ్లాదేశ్‌ (2), శ్రీలంక (1), పాకిస్థాన్ (0) తర్వాత నిలిచాయి.
Previous articleమళ్లీ మంత్రుల లొల్లి.. CM, PCC చీఫ్ వ్యూహమేంటి?
Next articleట్రంప్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఇజ్రాయెల్