హరీష్ రావుకు కరోనా.. ఎలా వచ్చిందంటే..

0
తెలంగాణాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎవరినీ వదలడం లేదు ఈ మహమ్మారి. తాజాగా మంత్రి హ‌రీశ్‌రావుకు కరోనా వచ్చింది. ఆయ‌న ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల క‌లిగే ల‌క్ష‌ణాలు ఉండడంతో.. ప‌రీక్ష చేయించుకున్నాన‌ని, ఆ ప‌రీక్ష‌లో పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చిన‌ట్లు మంత్రి త‌న ట్వీట్‌లో తెలిపారు. అయితే త‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ట్లు మంత్రి చెప్పారు. గ‌త కొన్ని రోజుల నుంచి త‌న‌ను క‌లిసిన‌వారు క‌చ్చితంగా క‌రోనా ప‌రీక్ష చేయించ‌కోవాల‌ని మంత్రి త‌న ట్వీట్‌లో కోరారు. త‌న‌తో కాంటాక్ట్ అయిన‌ ప్ర‌తి ఒక్క‌రూ ఐసోలేట్ కావాల‌ని, కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవాల‌ని హ‌రీష్ రావు అభ్య‌ర్థించారు.

అసెంబ్లీలో టెస్ట్ చేపించుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డికి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోవిడ్ రిపోర్ట్ నెగటివ్ రాగా మంత్రి హరీష్ రావుకు మాత్రం కరోనా పాజిటివ్ అని వచ్చింది. అయితే జూన్ నెలలోనే తన పీఏకి కరోనా సోకగా హరీష్ రావు హోమ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.

 

Previous articleకీసర ఎమ్మార్వో కేసులో సంచలనం.. తెరపైకి పెద్దల పేర్లు
Next articleఎట్టకేలకు IPL-2020 షెడ్యూల్‌పై క్లారిటీ.. ఆసక్తికరమైన పోస్టర్‌ విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here