రైతుల డిమాండ్లు, అనుమానాలు- MSPపై కేంద్రం వివరణ

1

రైతుల డిమాండ్లు:
ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి.
కనీస మద్దతు ధర (MSP)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలి.
మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలి.
రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలి.

రైతుల అనుమానాలు:
సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది.
ఒకే దేశం –ఒకే మార్కెట్‌ విధానంతో భవిష్యత్‌లో కనీస మద్దతు ధర (MSP) అన్నదే లేకుండా పోతుంది.
మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది.
రైతులు, వ్యాపారుల మధ్య వివాదాలను సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి రావడం.
కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌తో భూములకు రక్షణ కరువవుతుంది.
నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఏమంటోంది?:
సాగు చట్టాలకు రైతు సంఘాలు కోరిన మేరకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం.
కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి.
రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం.
రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాలను సూచనలు కోరుతున్నాం.

పీటముడి ఎక్కడ?:
వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (MSP)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్‌పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్‌ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous article150 డివిజన్లలో TRS.. BJP, కాంగ్రెస్‌‌ పార్టీల లెక్క తప్పింది
Next articleదేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here