England: మిగిలింది నాలుగే.. ఇక ఇంగ్లాండ్‌‌ ఇంటికే..?

0
డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ (England) వన్డే వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌‌కు చేరుతుందా.. ? మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలవడం అంత ఈజీ కాదా.. ? మిగిలిన నాలుగు గెలిచి పది పాయింట్లు సాధించినా సెమీఫైనల్‌‌కు చేరడం కష్టమేనా..?
భారీ అంచనాలతో భారత్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌.. కనీసం సెమీఫైనల్‌‌కు కూడా చేరకుండానే, నాలుగో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. సాంకేతికంగా ఇంకా మిగిలే ఉన్నా.. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే పాయింట్లు సాధించిన ఇంగ్లాండ్‌, రన్‌రేట్‌లోనూ బాగా వెనుకబడింది. దీంతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో తొమ్మిదో స్థానంలో ఉంది.

ఇక మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్, ఆసీస్, నెదర్లాండ్స్, పాకిస్థాన్‌లతో ఇంగ్లాండ్‌ తలపడాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నీ గెలవాలి. ఫామ్‌లో ఉన్న భారత్, ఆసీస్‌పై గెలవడం అంత ఈజీ కాదు. ఒకవేళ మిగిలిన నాలుగు గెలిచి పది పాయింట్లు సాధించినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిందే.

ఇంగ్లాండ్‌ ముందంజ వేయాలంటే అద్భుతాలే జరగాలి. అదృష్టం ఆ జట్టును వరించాలి. ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన శ్రీలంక తన సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleRahul Dravid: రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో భారత జట్టుకు కొత్త కోచ్‌.. ?
Next articleSiricilla Politics: మంత్రి కేటీఆర్‌పై రాణీ రుద్రమ ఆగ్రహం.. అసలేం జరిగింది..?