దుల్కర్‌ సల్మాన్‌కు కేరళ హైకోర్టులో రిలీఫ్

యాక్టర్, ప్రొడ్యూసర్ దుల్కర్‌ సల్మాన్‌కు కేరళ హైకోర్టులో రిలీఫ్ దక్కింది. దుల్కర్‌ లగ్జరీ కారు స్వాధీనం విషయంలో వారంలోగా నిర్ణయాన్ని తెలియజేయాలని కస్టమ్స్‌ విభాగాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
హైకోర్టు ఆదేశం మేరకు దుల్కర్‌.. సంబంధిత పత్రాలను కస్టమ్స్‌కు అందజేశారు. కొన్ని షరతులతో దుల్కర్‌ కారుతో పాటు మరొకరి కారును రిలీజ్ చేసేందుకు కస్టమ్స్ అధికారులు అంగీకరించారు. ఆయా కార్ల విలువలో 20 శాతాన్ని బ్యాంక్‌ గ్యారెంటీగా అందించిన తర్వాత రిలీజ్‌ చేయాలని నిర్ణయించారు.
అక్రమంగా భూటాన్‌ నుంచి వాహనాలు దిగుమతి చేసుకుంటున్నారన్న ఆరోపణలపై కస్టమ్స్‌ అధికారులు ఇటీవల కేరళలోని 30 చోట్ల సోదాలు చేపట్టారు. దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్ లాంటి సినీ ప్రముఖులు సహా పలువురి నివాసాల్లో ‘ఆపరేషన్‌ నుమ్‌ఖోర్‌’ పేరుతో సోదాలు జరిపి 36 కార్లను సీజ్‌ చేశారు.
తన కారును కస్టమ్స్ స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ దుల్కర్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కేరళ హైకోర్టులో ఊరట లభించింది.
Previous article100 రోజుల ప్రణాళిక అమలుపై పవన్ కల్యాణ్ ఫోకస్