గుండ్లపల్లిలో మొదలైన అభివృద్ధి పర్వం.. ప్రమాదకర విద్యుత్ లైన్ల తొలగింపుకు శ్రీకారం..

సర్పంచ్ పెంజర్ల మమతనర్సింలు, ఉపసర్పంచ్ సత్యనారాయణ గ్రామ సమస్యలపై ఫోకస్ పెట్టారు. స్థానికులు ఎంతోకాలంగా మొరపెట్టుకుంటున్న మల్లన్న గుడి నుంచి ఆంధ్ర నర్సింలు ఇంటి వరకు ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్ సమస్యపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లిలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి. సోమవారం కొత్త పాలకవర్గం కొలువుదీరగా.. మంగళవారం నుంచి సర్పంచ్ పెంజర్ల మమతనర్సింలు, ఉపసర్పంచ్ సత్యనారాయణ గ్రామ సమస్యలపై ఫోకస్ పెట్టారు. స్థానికులు ఎంతోకాలంగా మొరపెట్టుకుంటున్న మల్లన్న గుడి నుంచి ఆంధ్ర నర్సింలు ఇంటి వరకు ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్ సమస్యపై సర్పంచ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో విద్యుత్ అధికారులతో చర్చించి.. లైన్ తొలగించే పనులపై చర్చించారు. ప్రజలకు ప్రమాదకరంగా మారిన లైన్‌ను తొలగించేందుకు ఏఈ నరేందర్, లైన్‌మెన్ జీవన్ రెడ్డి సైతం ముందుకొచ్చారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సర్పంచ్ తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు సంతోషం వ్యక్త చేస్తున్నారు.
Previous articleప్రజాసేవే ధ్యేయం.. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం.. 2వ వార్డులో నిఖార్సైన లీడర్..