ఢిల్లీ (Delhi)లోని ఎర్రకోట సమీపంలో నిన్న జరిగిన భారీ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ National Investigation Agency (NIA)కి అప్పగించింది. సాధారణంగా NIA ఉగ్రవాద సంబంధిత కేసులను దర్యాప్తు చేస్తుంటుంది. దీంతో ఈ ఘటనను కేంద్రం ఉగ్ర దాడిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండుసార్లు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను రివ్యూ చేశారు. పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని, సమగ్ర దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేంద్రం ఈ కేసును NIAకి అప్పగించింది.
ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఢిల్లీ ఘటనకు పాల్పడిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.
ఈ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 12కు చేరింది.
CC ఫుటేజ్ ఆధారంగా జమ్మూకశ్మీర్లోని పుల్వామాకు చెందిన డా.ఉమర్ నబీ ఈ పేలుడులో కీలక వ్యక్తి అని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పేలుడుకు కారణమైన కారులో ఓ వ్యక్తి శరీర భాగాలను అధికారులు గుర్తించారు. అవి ఉమర్వా, కాదా అని తెలుసుకునేందుకు.. DNA శాంపిల్స్ కోసం అతడి తల్లి షమీమా బేగంను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.