ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు ICC (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ప్రయత్నిస్తోంది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు IOCకి ప్రతిపాదించింది. ICC ప్రయత్నాలు ఫలిస్తే, 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో మనం క్రికెట్‌ను చూడొచ్చు. 2028లో కచ్చితంగా ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండేటట్లు చూస్తామని ICC సభ్యుల బృందం స్పష్టం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది క్రికెట్ అభిమానులుంటే.. వీరిలో 90 శాతం మంది ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండాలని కోరినట్లు ICC వెల్లడించింది. ఇక 1900 ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లో ఒకసారి క్రికెట్‌ను చేర్చారు. అప్పుడు కేవలం రెండు జట్లు మాత్రమే ఆడాయి. 2028లో కనుక మళ్లీ క్రికెట్‌ను ప్రవేశపెడితే 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఈ ఆటను చూసినట్లవుతుంది.
అలాగే ఫార్మాట్ విషయానికొస్తే టీ-20 లేదా టీ-10లను నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల బీసీసీఐ కూడా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేయాలని కోరింది.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.