IPL-2020 షెడ్యూల్ కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న విడుదల చేస్తారని భావించినప్పటికీ.. నిరాశే ఎదురైంది. అయితే IPL 2020 పూర్తి షెడ్యూల్‌ను రేపే విడుదల చేస్తున్నట్లు ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ చెప్పారు. ఇప్పటికే టోర్నీ ఆరంభ, ఫైనల్ తేదీలు ఖరారైనప్పటికీ మ్యాచ్‌ల పూర్తి వివరాలు ప్రకటించలేదు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉంటే ఆరంభ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. గతేడాది ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ తొలి మ్యాచ్‌లో ఆడాలి. కానీ, ఇవాళ IPL ట్విటర్‌లో మాత్రం ఒక ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసింది. 14 రోజుల్లో మెగా ఈవెంట్ ప్రారంభమని తెలుపుతూ.. కోహ్లీ, దినేష్ కార్తీక్‌ల ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో RCB, KKR టీమ్స్ ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతాయా.. అనే సందేహం కలుగుతోంది.
2 weeks until the #Dream11IPL extravaganza! 🙌
CAN. NOT. WAIT! ⏳ pic.twitter.com/HoDqfQBE1q
— IndianPremierLeague (@IPL) September 5, 2020