బీటెక్, డిగ్రీ, పీజీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన ఉన్నత విద్యామండలి చైర్మన్

2
బీటెక్ పరీక్షలను వాయిదా వేసే ఆలోచనేమీ లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలను కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరీక్షలు వాయిదా పడుతాయని వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు.
పరీక్షల నిర్వహణపై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలజీలతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బీటెక్ విద్యార్థులు 40 వేల మంది మాత్రమే ఉన్నారని, కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు.
డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలను కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ చెప్పారు. అన్ని వర్సిటీల పరిధిలో 1.20 లక్షల మంది డిగ్రీ విద్యార్థులు ఉన్నారని, వారందరికీ భౌతిక దూరం, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleJNTU పరీక్షలపై పది పరీక్షల రద్దు ఎఫెక్ట్..?
Next articleబిడ్డకు “ఉద్యోగం” కల్పించడంలో ఉన్న ఆతృత… అంటూ రేవంత్ రెడ్డి ఫైర్

2 COMMENTS

  1. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here