వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు

TDP ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) మధ్య నెలకొన్న వివాదం, ఒకరి మీద మరొకరు బహిరంగ విమర్శలు చేసుకోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యూఏఈ పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఇవాళ ఇద్దరు నేతలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడతానని చంద్రబాబుకు పల్లా వివరించగా.. వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక పార్టీలో వివాదాలు, నేతల వ్యవహారశైలిపై తానే దృష్టిపెడతానని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తాను విదేశాల్లో పర్యటిస్తుంటే… కొందరు పార్టీ నేతలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలి. ఇలా బహిరంగ విమర్శలు చేయడం క్రమశిక్షణను ఉల్లంఘించడమే. బాధ్యతారహిత వ్యాఖ్యలతో అనవసర చర్చలకు తావిచ్చేలా నేతలు వ్యవహరించడం సమంజసం కాదన్నారు చంద్రబాబు.
అధినేత ఆదేశాలతో కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్నిలతో నేటి సమావేశాన్ని పల్లా శ్రీనివాసరావు రద్దు చేశారు.
Previous articleజూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై KCR సంచలన వ్యాఖ్యలు
Next articleCJI ఎంపికకు మొదలైన కసరత్తు..