TDP: మొన్న చంద్రబాబు.. ఇవాళ లోకేష్..

కొత్త ఎమ్మెల్యేల పనితీరుపై TDP జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచిచెడులు తెలియడం లేదని స్పష్టం చేశారు. అవగాహనా రాహిత్యం, అనుభవలేమితో సమన్వయం ఉండట్లేదన్నారు.
తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్‌ ఎమ్మెల్యేలు, నేతలు అవగాహన కల్పించాలని లోకేష్ సూచించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎలాంటి సమస్యలను అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే విషయాలపై కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన అవసరమని చెప్పారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలన్నారు.
ఇప్పటికే ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ, CMRF చెక్కుల అందజేత కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీ, CMRF చెక్కుల అందజేత వంటి ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని సీఎం దృష్టికి వచ్చింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువవుతున్న సమయంలో ప్రజాప్రతినిధులుగా వారు హాజరు కాకపోవడం పార్టీకి మంచిది కాదని చంద్రబాబు సీరియస్ అయ్యారు.
ఈ కార్యక్రమాల్లో ఇకపై ఎవరైనా పాల్గొనకపోతే వెంటనే తన దృష్టికి తేవాలని, అలాంటి ఎమ్మెల్యేలపై చర్యలకు వెనకాడబోమని సీఎం స్పష్టం చేశారు. వారికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పార్టీ కార్యక్రమాల అమలు కమిటీని CM చంద్రబాబు ఆదేశించారు.
Previous articleBIHAR: రెండో విడతలోనూ రికార్డు బ్రేక్ అవుతుందా..?
Next articleAndesri: అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికా