జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, BRS, BJP అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తుంది. 22న నామినేషన్లు పరిశీలిస్తారు. 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్లు లెక్కిస్తారు.
BRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇప్పటికే మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రేపు మరో సెట్ నామినేషన్ కూడా వేస్తారు. అయితే బీఆర్‌ఎస్ అధిష్ఠానం వ్యూహాత్మకంగా PJR కుమారుడు విష్ణువర్థన్ రెడ్డితో మరో నామినేషన్ దాఖలు చేయించింది.
ఒకవేళ BRS అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే.. ఆ పార్టీ నుంచి విష్ణువర్థన్ పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. మాగంటి సునీత నామినేషన్‌కు ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తరువాత విష్ణువర్థన్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని పార్టీ నేతలు చెప్తున్నారు.
నామినేషన్ల ఉపసంహరణకు 24 వరకు అవకాశం ఉండటంతో BRS నుంచి నామినేషన్లు వేసిన ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు బరిలో ఉంటారో తెలియాలంటే అప్పటివరకు ఆగాల్సిందే.