సీఎంపై తీవ్ర వ్యతిరేకత.. ఎట్టకేలకు రాజీనామా

0
అనుకున్నదే అయింది.. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావ‌త్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. నాలుగు గంటలకు గ‌వ‌ర్నర్‌ను క‌లిసి త‌న రాజీనామా లేఖ‌ను అంద‌జేశారు. రావ‌త్ స్థానంలో ధ‌న్‌సింగ్ రావ‌త్ సీఎం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే గత శనివారం బీజేపీ పరిశీలకుడు రమణ్ సింగ్ పలువురు ఎమ్మెల్యేలతో డెహ్రాడూన్‌లో సమావేశమయ్యారు. నాయకత్వం మార్పుపై కూడా చర్చించారు. అనంతరం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నివేదిక ఇచ్చారు. రావ‌త్ ప‌నితీరుపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్న రావత్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డాను క‌లిశారు.

వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో బీజేపీ ఇప్పుడు నాయ‌క‌త్వ మార్పు చేసింది. అయితే ఇప్పుడా పార్టీ ఎవ‌రినీ తీసుకొచ్చినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌ద‌ని, రాష్ట్రంలో త‌మ ప‌నితీరు స‌రిగా లేద‌ని బీజేపీ నాయ‌క‌త్వానికీ తెలుస‌ని మాజీ సీఎం హ‌రీష్ రావ‌త్ అన్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleభలే దొంగలు..అంబులెన్స్ లోనే నొక్కేశారు..
Next articleకేసీఆర్ కు కరోనా పాజిటివ్..ఎలా అంటే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here