ప్రజాసేవే ధ్యేయం.. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం.. 2వ వార్డులో నిఖార్సైన లీడర్..
ప్రజలకు ఉపయోగ పడుతుందంటే దేనికైన సిద్ధమనే తెగువకు ఆయనే నిలవెత్తు నిదర్శనం. నాయకుడు అంటే ప్రజలతో నడిచేవాడు కాదు ప్రజల్ని నడిపించేవాడు. నాయకుడంటే ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి.. అటువంటి నాయకుడే సదానందం.
Sadanand
విషయ పరిజ్ఞానం.. కష్టపడే మనస్థత్వం.. ఇవన్నీ కలబోసిన వ్యక్తి బోల్ల సదానందం. జీవితంలో అవరోధాలు, అడ్డంకులు ఎదురైన ఎదురొడ్డి నిలిచిన అలుపెరగని యోధుడు అతడు. ప్రజలకు మంచి చేయాలన్న ఆయన తపననే ఆయన్ని ముందుకు నడిపిస్తుంది. వ్యక్తులు, పార్టీలు, వ్యవస్థలు వీటన్నిటికంటే ప్రజాసంక్షేమం ముఖ్యమన్నదే ఆయన విధానం. ప్రజలకు ఉపయోగ పడుతుందంటే దేనికైన సిద్ధమనే తెగువకు ఆయనే నిలవెత్తు నిదర్శనం. నాయకుడు అంటే ప్రజలతో నడిచేవాడు కాదు ప్రజల్ని నడిపించేవాడు. నాయకుడంటే ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి.. అటువంటి నాయకుడే సదానందం.
అధికారం కోసం ఎప్పుడూ ఆయన అడ్డదారులు తొక్కలేదు.. ప్రజల మీద తనకున్న నమ్మకమే దానికి కారణం. నిజమైన నాయకులు ఓట్ల నుంచి కాదు జనం గుండెల్లో నుంచి పుడతారనేది ఓ నానుడి. దానికి నిలువెత్తు నిదర్శనం సదానందం. అన్న అని పిలిస్తే తనను నమ్మిన వారికోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధపడతాడు. సామాన్యులకు మంచి జరుగుతుందంటే చాలు అది ఎంత కష్టమైన భరించే నైజం ఆయన సొంతం. ఆటంకాలు ఎదురైన, అవాంతరాలు అడ్డొచ్చిన తాను నమ్మిన బాటలోనే నడుస్తున్న నాయకుడు ఆయన.
సదానందం వన్ మ్యాన్ ఆర్మీ.. ఆయనకు దూకుడే మంత్రం. రాజీలేని పోరాటమే తంత్రం.. ఏదిఏమైన ముందుకు దూసుకెళ్లడమే వ్యూహం..పోరాడితే పోయేదేముంది.. ప్రజాసమస్యలు తప్ప.. అనే లక్ష్యంతో గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచాడు. 2వార్డు నుంచి బరిలోకి దిగి తనను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. అటు ప్రజలు సైతం సదానందం వెంటే అంటున్నారు. స్టూల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెబుతున్నారు.