BJP అధిష్టానం మరో కీలక నిర్ణయం.. తెలంగాణకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌‌గా..

0
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై బీజేపీ (BJP) అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధిష్టానం దూకుడు పెంచింది. తెలంగాణ (Telangana), రాజస్థాన్‌ (Rajasthan), మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది.
తెలంగాణకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను నియమించిన అధిష్టానం.. సునీల్‌ బన్సల్‌‌ను సహాయ ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఓపీ మాథుర్‌, సహాయ ఇన్‌ఛార్జిగా కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, రాజస్థాన్‌కు ఇన్‌ఛార్జ్‌గా కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ, సహాయ ఇన్‌ఛార్జిగా గుజరాత్‌ మాజీ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌, మధ్యప్రదేశ్‌కు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ ఇన్‌ఛార్జ్‌గా, కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ను సహాయ ఇన్‌ఛార్జిగా నియమించింది.

ఇప్పటికే తెలంగాణ BJP అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిని నియమించింది. BJP అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా చేరికల కమిటీ ఛైర్మన్‌, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించింది. మరో మూడు రాష్ట్రాలకూ కొత్త అధ్యక్షులను నియమించింది.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleనై.. నై.. అంటూనే ముందస్తుకు సై.. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలతో పాటే..?
Next articleకాసేపట్లో వరంగల్‌‌కు మోదీ.. ప్రధాని హోదాలో తొలిసారి వచ్చింది మాత్రం..