తెలంగాణ ప్రభుత్వ జీవో‌పై సుప్రీంకోర్టులో విచారణ..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోపై ఇవాళ సుప్రీంకోర్టులో, ఎల్లుండి హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్‌ను ఈ నెల 9న జారీచేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది.
ఈ జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటు అధికారులను, అటు పార్టీ నేతలను ఆదేశించారు. సీనియర్‌ న్యాయకోవిదులతో ముందే మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీ వెళ్లారు.
Previous articleవన్డే వరల్డ్‌కప్ వరకు కొనసాగడం కష్టమే
Next articleబిహార్‌తో పాటు జూబ్లీహిల్స్ షెడ్యూల్ వచ్చేసింది