ByPoll: అక్కడ బడ్గాం.. ఇక్కడ జూబ్లీహిల్స్.. గెలుపెవరిది?..

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నవంబరు 11న పోలింగ్‌, 14న కౌంటింగ్ నిర్వహిస్తారు.
తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు జమ్మూకశ్మీర్‌లోని బడ్గాం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
జమ్మూకశ్మీర్‌లో గత ఏడాది నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (NC) నేత ఒమర్‌ అబ్దుల్లా గాందర్‌బల్‌, బడ్గాం స్థానాల నుంచి పోటీ చేసి.. రెండు చోట్లా గెలిచారు. ఈ క్రమంలో సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఒమర్‌.. బడ్గాం సీటుకు రాజీనామా చేశారు. అయితే ఇక్కడి నుంచి ముగ్గురు రాజకీయంగా శక్తిమంతమైన షియా వర్గానికి చెందిన వారే బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది.
ప్రస్తుతం NC పార్టీ నుంచి మాజీ మంత్రి ఆగా సయ్యద్‌ మహమూద్‌ బరిలో దిగారు. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి చెందిన PDP నుంచి యువనేత ఆగా సయ్యద్‌ ముంతజీర్‌ మెహదీ పోటీ చేస్తున్నారు.
BJP నుంచి ఆగా సయ్యద్‌ మొహ్సీన్‌ బరిలోకి దిగారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని లెక్కలు వేస్తున్నారు. NC, PDPలు బడ్గాం అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని విమర్శిస్తున్నారు.
మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగిన ముగ్గురు ‘ఆగా’ల్లో ఎవరు గెలుస్తారన్నది వచ్చే నెల 14న తేలనుంది.
Previous articleఫిర్యాదులపై డీజీపీని నివేదిక కోరిన పవన్ కల్యాణ్
Next articleఇవాళే నామినేషన్ల పరిశీలన.. BRSలో హైటెన్షన్